హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు జన్మాష్టమి ఆహ్వానం

SRD: సంగారెడ్డి పట్టణం గణేశ్‌నగర్‌లోని మురళీకృష్ణ ఆలయంలో ఈ నెల 4న నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు మంగళవారం అందజేశారు. వేడుకలకు హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.