యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత ఇవాళ చోటుచేసుకుంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలు క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించినట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత


