హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్1 పెన్షన్ విద్రోహ దినంగా ఉపాధ్యాయుల నిరసన

MLG: వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1ను పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా అని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ‘‘పెన్షన్ మా హక్కు–భిక్ష కాదు’’, ‘‘సీపీఎస్ రద్దు–ఓపీఎస్ పునరుద్ధరణ’’ అంటూనినాదాలు చేశారు.