MNCL: బెల్లంపల్లిలో RTC బస్సు డిపో ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం మరిన్ని బస్సులను కేటాయించాలని గ్రీన్ బెల్లంపల్లి టీమ్ సభ్యులు కోరారు. ఎమ్మెల్యే వినోద్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బస్ డిపో ఏర్పాటుతో ప్రజలకు ప్రధాన నగరాలకు అనుసంధానం మెరుగవుతుందన్నారు. బస్సులు పెరగడం వలన సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా కష్టాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
తెలంగాణ
RTC బస్సు డిపో ఏర్పాటు చేయాలని MLAకు వినతి


