దేశంలో జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఆగస్టు నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వసూళ్లు 14.8 శాతం మేర వృద్ధి చెందాయి. దీంతో ఈ నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందనడానికి ఈ వసూళ్ల వృద్ధి నిదర్శనంగా నిలుస్తోందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వార్తలు
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు


