హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన DEO

BHPL: జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్. లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించారు. అనంతరం కలెక్టర్, DEOకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా విద్యాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.