ఆసిఫాబాద్ జిల్లాలో ముస్లిం మహిళలకు 550 కుట్టుమిషన్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి తిరుపతి తెలిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 275 చొప్పున కేటాయించామన్నారు. పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, కుట్టుమిషన్ శిక్షణ పొందినవారు, పదో తరగతి అర్హత ఉన్న మహిళలకు అందజేస్తున్నమన్నారు.
తెలంగాణ
VIDEO: ఆసిఫాబాద్ జిల్లాలో 550 కుట్టుమిషన్ల పంపిణీ


