హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు: కూనంనేని

BDK: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు తమశాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేసే అధికారం లేకుండా పోయిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నిధుల మంజూరు కోసం మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఈ కారణంగా పనులు ముందుకు సాగడం లేదని, కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.