SRCL: సంకెపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామంలో పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట మొక్కలు నాటారు. మొక్కలను నాటి వాటి సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పండుగ శంకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పథకంతో మొక్కల నాటకం


