హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నోటీసులు అందుకున్న ఓటర్లు స్పందించాలి'

NGKL: అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు వెంటనే స్పందించి, అవసరమైన సరైన పత్రాలను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ మురళి కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఫామ్ 6 ద్వారా నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.