NDL: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్ సకాలంలో అందేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బనగానపల్లె రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సకాలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: మంత్రి


