ప్రకాశం: తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ విశ్రాంత ఉద్యోగులు మంగళవారం నిరసన చేపట్టారు. గిద్దలూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో “సీఎం సారు.. మా డబ్బులు మాకు ఇవ్వండి” అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు లో విశ్రాంత ఉద్యోగుల నిరసన


