NDL: కూటమి ప్రభుత్వ పింఛన్ల పంపిణీ దేశానికి ఆదర్శమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం డోన్ పట్టణంలో 15వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. డోన్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కరానికి అందుబాటులో ఉంటామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీ దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే


