హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అండగా నిలుస్తోన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్

ELR: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.4 వేల పింఛన్‌ను ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ కోసం లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే నగదు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.