హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై హత్యాయత్నం కేసు.. ఎస్సై పై చర్యలు

తూ.గో: కోరుకొండ మండలంలోని గాడాలలో మహిళపై హత్యాయత్నం కేసులో పోలీసులు అలసత్వం వహించడంపై జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోరుకొండ ఎస్సై రమే‌ష్‌ను వీఆర్‌ను పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.