హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

ASR: చింతూరులోని సరిగేల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 30పై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కొత్తూరు గ్రామానికి చెందిన కొవ్వాసు రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.