హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో మంగళవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.