హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో 4న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

చిత్తూరులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఈనెల 4న ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు. ఉదయం 5 గంటలకు ప్రభాతభేరి, 108 బిందెలతో అభిషేకం, కల్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఉట్ల తిరునాళ్ల, శ్రీ రుక్మిణీ సత్య భామా సమేత వేణుగోపాల స్వామి పుష్పపల్లకి సేవ, ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.