ADB: గుడిహత్నూర్ మండలం వైజాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొత్త ఇల్లు నిర్మిస్తున్న కనక విలాస్ మంగళవారం ఉదయం స్లాబ్‌కు నీళ్లు పడుతుండగా విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
గుడిహత్నూర్‌లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


