హైదరాబాద్: 28°C
తెలంగాణ

లీకైన పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు

GDWL: అలంపూర్ పట్టణ సమీపంలోని తుంగభద్ర మిషన్ భగీరథ పైప్లైన్లు లీకేజీ అయ్యాయి. దీంతో గత రెండు రోజులుగా నీరు వృధా అవుతుంది. ఫలితంగా నది అవతలి గ్రామాల ప్రజలు నీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.