హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సుబ్రహ్మణ్యస్వామికి అభిషేక పూజలు

BHNG: భువనగిరి పట్టణ శివారులోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో వెలసిన శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆవుపాలతో అభిషేకం చేసి, వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.