హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక రైళ్లు వేసినా తీరని ప్రయాణికుల కష్టాలు

GNTR: సెలవుల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చేవారి సంఖ్య పెరగడంతో నరసాపూర్, విశాఖ, నారాయణాద్రి వంటి రైళ్లలో టికెట్లు దొరకక ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ, అవి గమ్యస్థానాలకు తీవ్ర ఆలస్యంగా నడుస్తుండటం, గుంటూరు కోటా సీట్లు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు అసంతృప్తి చెందుతున్నారు.