SKLM: మందస మండలం గడ్డూరు గ్రామానికి చెందిన వంక యాదవరావు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇవాళ ఉదయం ముగ్గురు సహచరులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా.. అలల ధాటికి తెప్ప తిరగబడింది. ఈ ఘటనలో అందరూ సముద్రంలో పడిపోగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. యాదవరావు మాత్రం తెప్ప కింద చిక్కుకుని ఊపిరాడక అస్వస్థతకు గురై మరణించాడు.
ఆంధ్రప్రదేశ్
తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి


