SRCL: బోయినిపల్లి మండలం మానువాడ వద్ద నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర (మధ్య మానేరు) జలాశయం కట్ట తాగుబోతులకు అడ్డాగా మారుతోంది. కట్టపై మద్యం సేవిస్తున్న కొందరు తాగిన సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి, ఖాళీ సీసాలను విచక్షణారహితంగా వదిలేస్తున్నారు. దీంతో వాహనదారులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మానేరు కట్టపై మందుబాబుల హల్‌చల్


