హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజోలులో శివాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన

MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్ సోమవారం కురవి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శివాలయం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్, కార్యకర్తలు,స్థానికులు, తదితరులున్నారు.