MDK: పాపన్నపేట మండలానికి చెందిన RTC డ్రైవర్ పోతేదార్ సురేందర్ (58) విధి నిర్వహణలో గుండెపోటుతో మృతిచెందారు. ఖేడ్ డిపో నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బోయినిపల్లి వద్ద గుండెపోటు తీవ్రం కావడంతో ప్రయాణికుల భద్రత కోసం బస్సును పక్కకు నిలిపి స్టీరింగ్‌పై ఒరిగిపోయారు. ప్రయాణికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేందర్ మృతితో ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు.
తెలంగాణ
ప్రయాణికులను కాపాడి.. ప్రాణాలు విడిచిన డ్రైవర్


