హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుదేరా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెండ్ చేశారు. కళాశాల నిర్వహణలో వైఫల్యాలు, పరిపాలనాపరమైన నిర్లక్ష్యం, విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.