హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే అనకాపల్లికి 'పోలవరం' జలాలు

AKP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రేపు తొలి అడుగు పడనుంది. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తరలించనున్నారు. తుని-నర్సీపట్నం రోడ్డుపై నిర్మించిన అక్విడెక్టు వద్ద CM చంద్రబాబు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. తొలి విడతలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లికి తరలిస్తారు. అటు నిన్న వెలిగొండ ఫేజ్-1 ప్రారంభించిన సీఎం, 2028 కల్లా మొత్తం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు.