హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి క్రీడాకారులకు కలెక్టర్ సన్మానం

NRPT: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కృష్ణ మండలం కున్సి పాఠశాలకు చెందిన జాతీయస్థాయి క్రీడాకారిణులు తనూజ, సనను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సన్మానించి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతరం నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.