హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేశ్ హత్య కేసులో నిందితుడు మధు మృతి

WGL: గీసుగొండ మండలంలో కాంగ్రెస్ నాయకుడు అడప మహేశ్ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న జన్ను మధు మృతి చెందాడు. జులై 18న కోటిలింగాల ఆలయం సమీపంలో మహేశ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మధు నిందితుడిగా ఉన్నాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధు మంగళవారం ఉదయం మృతి చెందినట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.