హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణపేటలో భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

NRPT: నారాయణపేట పట్టణంలోని సింగార్ బేస్ శ్రీ శివలింగేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని గణనాథుని మూలవిరాట్‌కు భక్తులు పంచామృతాభిషేకం, అర్చన, మహా మంగళహారతి నిర్వహించి నైవేద్యం సమర్పించారు. మహిళలు ప్రత్యేకంగా ఉపవాస దీక్ష చేపట్టి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు శివకుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.