ASR: డుంబ్రిగుడ మండలం బిట్రగండ, వై. కొల్లాపుట్టు, బొడ్లమామిడి గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాకాలంలో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో వాహనాలు గ్రామాలకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. రహదారుల సమస్యపై పలుమార్లు ఐటీడీఏ మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రహదారులతో గిరిజనుల అవస్థలు


