WGL: నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,830 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్


