హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘన సన్మానం

NLG: జిల్లా పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన డి. వెంకటేశ్వర్లు రెడ్డి, బి. మోహన్‌రావులను జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్, ఐపీఎస్‌ ఘనంగా సన్మానించారు. వారి 36 ఏళ్ల సేవలు, అంకితభావం, క్రమశిక్షణను ఎస్పీ అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.