హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలనూతల ముంపు గ్రామానికి పెరిగిన వరద!

ప్రకాశం: మర్కాపురం జిల్లా కలనూతల ముంపు గ్రామానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. వెలిగొండ కెనాల్ నుంచి భారీగా వరద పెరగడంతో కారు వాటర్‌లో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన ముగ్గురు యువకులు కారులో నుంచి బయటపడి చెట్టు ఎక్కారు. ఎవ్వరూ కాపాడేవారు లేక రాత్రంతా చెట్టుపైనే ఉండిపోయారు. తెల్లవారు జామున పోలీసులకు సమాచారం తెలియడంతో అప్రమత్తమైన ముగ్గురు యువకులను క్షేమంగా కాపాడారు.