హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురు పోలీసు అధికారులకు ఘన సన్మానం

JGL: పోలీసు శాఖలో దీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఐదుగురు సిబ్బందిని జగిత్యాల అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై జమీల్ అహ్మద్, ఏఎస్ఐలు సీహెచ్. శ్రీనివాస్, ఆర్. కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు ఏ. శ్రీనివాస్, పీ. రాజయ్యలను జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.