JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై టాటా ఏస్ ఢీకొని బాంజీపేటకు చెందిన ఈరపురం వెంకటమ్మ (50) మృతి చెందింది. నిడిగొండ నుంచి కాలినడకన వస్తుండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న టాటా ఏస్ ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటమ్మను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.
తెలంగాణ
టాటా ఏస్ ఢీకొని మహిళ మృతి!


