హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడిపికొండ బ్రిడ్జిపై రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు

HNK: కాజీపేట మండలంలోని కడిపికొండ బ్రిడ్జిపై మంగళవారం రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.