AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధిలో మంగళవారం శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మంగళవారం పురస్కరించుకుని మహిళా భక్తులు గాజులు గౌరీ వ్రతం ఆచరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్, ఫణి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలలో పాల్గొనడానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు పెంటారావు, సత్తిబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తిశ్రద్ధలతో గాజుల గౌరీ వ్రతము


