ASR: కొయ్యూరు మండలంలోని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థినులకు కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రత, కెరీర్‌పై అవగాహన కల్పించారు. అపరిచితుల కాల్స్, లింక్‌లను నమ్మవద్దని, OTP, ATM, UPI PINలు పంచుకోవద్దని సూచించారు. చదువు, కెరీర్‌పై దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా కళాశాలలో సైబర్ అవగాహన


