మంచిర్యాల కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకంతో పిల్లలను చేర్పిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
'విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలి'


