AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,042 మంది భక్తులు దర్శించుకోగా.. 36,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
తిరుమల సమాచారం


