హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. నిన్న స్వామివారిని 81,687 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,938 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.