హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌లో 81 వినతులు

CTR: కుప్పం MPDO కార్యాలయంలో కడ పీడీ వికాస్ మర్మత్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 81 అర్జీలు వచ్చినట్లు కడ కార్యాలయం తెలిపింది. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 29, గ్రామీణ, నీటి సరఫరాకు 7, విద్యా శాఖకు 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 5, తాగునీటికి సంబంధించి 4, పెన్షన్, ఉపాధి హామీ మూడు చొప్పున అర్జీలు వచ్చాయి.