హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మోటార్లు, వైర్ల చోరీలను అరికట్టాలి'

JGL: ఎస్సారెస్పీ వరద కాలువ వెంబడి విద్యుత్ మోటార్లు, వైర్లు చోరీకి గురవుతూ రైతులు నష్టపోతున్నారని రైతు ఐక్యవేదిక కథలాపూర్ నాయకులు తెలిపారు. చోరీలను అరికట్టాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. జిల్లాలో నిత్యం మోటార్లు, వైర్లు చోరీ అవుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిఘా పెంచాలని కోరారు.