హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పింఛన్ కార్యక్రమం

ఏలూరు: జిల్లాలో సెప్టెంబర్ 1న 2,53,845 మంది పింఛనుదారులకు రూ.111.60 కోట్ల పింఛన్ సొమ్ము పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పంపిణీకి 4,932 మంది సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.