హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు, రాయితీలు: కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవేత్తలకు అనుమతులు, రాయితీలు సకాలంలో అందించాలని కలెక్టర్ మంగళవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో 11 మెగా పరిశ్రమలు రూ.43,650 కోట్ల పెట్టుబడితో 16,380 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగిల్ డెస్క్ ద్వారా వచ్చిన 386 దరఖాస్తుల్లో 365కు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.