హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాద బాధితులకు రెడ్‌క్రాస్ సహాయం

కృష్ణా: చల్లపల్లి పడమరవీధిలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన గొరిపర్తి శ్రీనివాసరావు కుటుంబానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చల్లపల్లి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సాయమందించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వచ్చిన వంటసామాగ్రి కిట్, హెవీ టార్పాలిన్, రగ్గులను తహసీల్దార్ డి.వనజాక్షి చేతులమీదుగా అందచేశారు.