హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 2న భారీ బైక్ ర్యాలీ చేస్తాం: MLA

W.G: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను భీమవరంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న విస్సా కోడేరు వంతెన వద్ద ప్రారంభమై మల్టీప్లెక్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మల్టీప్లెక్స్ లోని కల్యాణ మండపంలో పవన్ కల్యాణ్ వర్చువల్గా జనసేన యువజన విభాగ విధివిధానాలను ప్రకటిస్తారన్నారు.