SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లగడ్డలో రాడ్ బెండింగ్ పనులకు వచ్చిన ఖమ్మం జిల్లా మధిర మండలం రాఘపట్నానికి చెందిన గంట వెంకటరామయ్య అదృశ్యమయ్యాడు. ఈ నెల 26న తోటి కార్మికులతో అల్పాహారం చేసిన అనంతరం కనిపించకుండా పోయినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
తాళ్లగడ్డలో రాడ్ బెండింగ్ కార్మికుడి అదృశ్యం!


